Goodluck Sakhi: ఇంతందంగా ఉంటుందా ఈ లోకం..

‘‘ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే.. చెంగు చెంగు మంటాందే మనసు. తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు’’ అంటూ హుషారుగా చిందేస్తోంది కీర్తి సురేష్‌.

Updated : 27 Dec 2022 17:36 IST

‘‘ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే.. చెంగు చెంగు మంటాందే మనసు. తొంగి తొంగి సూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగి పోతాందే మనసు’’ అంటూ హుషారుగా చిందేస్తోంది కీర్తి సురేష్‌. ఆమె ప్రధాన పాత్రలో నగేష్‌ కుకునూర్‌ తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం ‘గుడ్‌లక్‌ సఖీ’. సుధీర్‌ చంద్ర పదిరి నిర్మాత. దిల్‌రాజు సమర్పిస్తున్నారు. ఆది పినిశెట్టి కథానాయకుడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం ఈ చిత్ర గీతాన్ని విడుదల చేశారు. ‘‘ఇంతందంగా ఉంటుందా ఈ లోకం.. ఇన్నాళ్లు ఈ మనసుకు తెలియలేదే పాపం’’ అంటూ సాగుతున్న ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీనే స్వయంగా ఆలపించారు. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితమిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ స్పోర్ట్స్‌ డ్రామా సినిమాలో కీర్తి ఓ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఆమెకు షూటింగ్‌లో శిక్షణ ఇచ్చే కోచ్‌గా జగపతిబాబు నటించారు. ఈ చిత్రానికి చిరంతాన్‌ దాస్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని