Hero: రానా చేతుల మీదగా ‘హీరో’ పాట

తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్‌ కథానాయిక. యాక్షన్‌, లవ్ ఎంటర్‌టైనర్‌గా...

Updated : 07 Dec 2022 16:52 IST

హైదరాబాద్‌: తెదేపా ఎంపీ గల్లా జయదేవ్‌ కుమారుడు అశోక్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘హీరో’. నిధి అగర్వాల్‌ కథానాయిక. యాక్షన్‌, లవ్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమవుతోన్న ఈ చిత్రానికి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాట విడుదలైంది. ‘అచ్చ తెలుగందమే’ అంటూ సాగే ఈ పాటను సిద్ధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. లవ్‌, ఫీల్‌గుడ్‌ సాంగ్‌గా రూపుదిద్దుకున్న ఈ పాటను నటుడు రానా సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. ‘హీరో’ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్‌ స్వరాలు అందిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు