RRR: కొమురం భీముడో...

‘‘భీమా... నినుగన్న నేలతల్లి, ఊపిరి పోసిన సెట్టు సేమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రు. వినబడుతుందా?’’ అంటూ కొమురం భీమ్‌ కోసం ఓ పాట ఆరంభమైంది. కొమురం భీముడో... అంటూ తన  బిడ్డ గురించి నేలతల్లి, చెట్టు చేమ, గోండు జాతి ఏం చెప్పిందో, అతనిలో ఎలా స్ఫూర్తిని నింపిందో తెలియాలంటే ఈ... పాట వినాల్సిందే. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలోని ఈ పాటకి సంబంధించిన వీడియోని శుక్రవారం విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలో ఈ గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ...

Updated : 25 Dec 2021 09:46 IST

‘‘భీమా... నినుగన్న నేలతల్లి, ఊపిరి పోసిన సెట్టు సేమ, పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రు. వినబడుతుందా?’’ అంటూ కొమురం భీమ్‌ కోసం ఓ పాట ఆరంభమైంది. కొమురం భీముడో... అంటూ తన  బిడ్డ గురించి నేలతల్లి, చెట్టు చేమ, గోండు జాతి ఏం చెప్పిందో, అతనిలో ఎలా స్ఫూర్తిని నింపిందో తెలియాలంటే ఈ... పాట వినాల్సిందే. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ చిత్రంలోని ఈ పాటకి సంబంధించిన వీడియోని శుక్రవారం విడుదల చేశారు. కీరవాణి స్వరకల్పనలో ఈ గీతాన్ని సుద్దాల అశోక్‌తేజ రచించగా, కాలభైరవ ఆలపించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథా  నాయకులుగా నటిస్తున్న చిత్రమిది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌... కొమురం భీమ్‌గా నటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని