Niharika: మా బాబాయ్‌ రావడం లేటవచ్చు.. కానీ, బాక్సాఫీస్‌లు బద్దలవ్వడం పక్కా: నిహారిక

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘భీమ్లానాయక్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది....

Published : 23 Dec 2021 15:38 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘భీమ్లానాయక్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రిలీజ్‌ని దృష్టిలో ఉంచుకొని ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయంపై తాజాగా నటి నిహారిక స్పందించారు. ‘భీమ్లానాయక్‌’ సూపర్‌ హిట్‌ అవుతుందని అన్నారు. ‘‘మా బాబాయ్‌ ఓ సినిమాలో చెప్పినట్టు.. ‘‘రావడం కాస్త లేటు అవ్వొచ్చు. కానీ రావడం మాత్రం పక్కా’’ అదే మాదిరిగా సినిమా విడుదల కాస్త ఆలస్యం కావొచ్చు. కానీ బాక్సాఫీస్‌ బద్దలు కొట్టడం పక్కా’’ అని అన్నారు.

అనంతరం ఆమె ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’పై స్పందించారు. ‘‘తారక్‌ అన్న నాకు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన సతీమణి ప్రణతి నా క్లాస్‌మేట్. ఆయన ఎనర్జీ మరోస్థాయిలో ఉంటుంది. ‘ఆర్‌ఆర్ఆర్‌’ ట్రైలర్‌ చూశాక.. చరణ్‌ని ప్రత్యేకంగా కలిసి.. నా అభినందనలు చెప్పాను. ఇటీవల ఓ థియేటర్‌లో ఆ ట్రైలర్‌ చూస్తుంటే నాకు ఒళ్లు గగుర్పొడిచింది. చరణ్‌ సోదరిగా ఈ మాట చెప్పడం లేదు. ఒక ప్రేక్షకురాలిగా చెబుతున్నా. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’’ అని నిహారిక వివరించారు.

Read latest Cinema News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని