Nikhil: గూఢచారిగా నిఖిల్‌

విజయవంతమైన ‘గూఢచారి’, ‘ఎవరు’ తదితర చిత్రాల ఎడిటర్‌ గ్యారీ.బి.హెచ్‌ మెగాఫోన్‌ చేతపట్టారు. నిఖిల్‌ కథానాయకుడిగా ఓ యాక్షన్‌ స్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక.

Updated : 09 Oct 2021 07:02 IST

విజయవంతమైన ‘గూఢచారి’, ‘ఎవరు’ తదితర చిత్రాల ఎడిటర్‌ గ్యారీ.బి.హెచ్‌ మెగాఫోన్‌ చేతపట్టారు. నిఖిల్‌ కథానాయకుడిగా ఓ యాక్షన్‌ స్పై చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఐశ్వర్య మేనన్‌ కథానాయిక. కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజశేఖర్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, ఆయన తనయుడు ధృవ్‌, తనయ ఈశన్వి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రముఖ నిర్మాతలు శరత్‌ మరార్‌, జెమినీ కిరణ్‌, దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ‘‘విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్న నిఖిల్‌ తొలిసారి తెరపై ఓ గూఢచారి పాత్రలో నటిస్తున్న చిత్రమిది. యాక్షన్‌కి ప్రాధాన్యం ఉంది. అధిక నిర్మాణ వ్యయంతో, మంచి సాంకేతిక బృందంతో రూపుదిద్దుకొంటోంది. దర్శకత్వం వహిస్తున్న గ్యారీనే ఎడిటర్‌ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. సినిమాకి ఇంకా పేరు ఖరారు చేయలేద’’ని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి రచన: అనిరుధ్‌ కృష్ణమూర్తి, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: మనోజ్‌రెడ్డి, కళ: అర్జున్‌ సురిశెట్టి, సహ నిర్మాత: చరణ్‌తేజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని