Nikhil: థియేటర్లు మూతపడటం చూస్తుంటే హృదయం ముక్కలవుతోంది: నిఖిల్‌

సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునరాలోచించాలని నటుడు నిఖిల్‌ కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడటం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని ఆయన అన్నారు....

Updated : 26 Dec 2021 15:12 IST

ఏపీ ప్రభుత్వానికి నటుడి వినతి

హైదరాబాద్‌: సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునరాలోచించాలని నటుడు నిఖిల్‌ కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు మూతపడటం చూస్తుంటే తన హృదయం ముక్కలవుతోందని ఆయన అన్నారు. ఈ మేరకు నిఖిల్‌ ఆదివారం ఉదయం ట్విటర్‌ వేదికగా ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ పరిశ్రమకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

‘‘ప్రతి సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో రూ.20 టికెట్‌ సెక్షన్‌ ఉంది. దానివల్ల సినిమా థియేటర్స్‌ అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువవుతున్నాయి. రైళ్లలో ఏవిధంగా అయితే కంపార్ట్‌మెంట్‌ను ఆధారంగా చేసుకుని టికెట్‌ డబ్బులు వసూలు చేస్తారో అదే మాదిరిగా బాల్కనీ, ప్రీమియం సెక్షన్ల టికెట్‌ ధరల్లో సవరింపులు చేయాలని అధికారులను కోరుతున్నాను. ప్రేక్షకులకు ప్రతిక్షణం ఆనందాన్ని అందిస్తోన్న సినిమాహాళ్లు నాకు దేవాలయాలతో సమానం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా థియేటర్లు మూతపడటం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం సంతోషంగా అనిపిస్తుంది. ఇదే మాదిరిగా థియేటర్లు పూర్వవైభవం సొంతం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా’’ అని నిఖిల్‌ ట్వీట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని