
Nikhil: కన్నీళ్లు ఆగడం లేదు: నిఖిల్
‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం నటుడి విజ్ఞప్తి
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రానికి దేశవ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని నటుడు నిఖిల్ కోరారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి తాజాగా విడుదలైన ‘జనని’ పాటని ప్రశంసిస్తూ నిఖిల్ శనివారం ఓ ట్వీట్ చేశారు. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ‘జనని’ పాట తనకు ఎంతో నచ్చిందని అన్నారు. ‘‘ఇప్పటివరకూ 20 సార్లు జనని పాట చూశాను. చూసిన ప్రతిసారీ నాకు కన్నీళ్లు ఆగలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్’.. దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసే చిత్రమవుతుందని భావిస్తున్నాను. కీరవాణి, రాజమౌళి.. మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు. దేశవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’కి పన్ను మినహాయింపు ఇవ్వాలని నా విన్నపం’’ అని నిఖిల్ పేర్కొన్నారు. మరోవైపు కథానాయిక అనుష్క శెట్టి సైతం ‘జనని’ సాంగ్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పాట విన్నాక తనకు మాటలు రావడం లేదని, భావోద్వేగానికి లోనయ్యానని ఆమె తెలిపారు.
రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్, తారక్‌కు జంటగా ఒలీవియా మోరీస్ కీలక పాత్రలు పోషించారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత. జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.