Nithiin: క్వారంటైన్‌లో షాలిని.. విభిన్నంగా బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌

‘‘కొవిడ్‌.. మనుషుల మధ్య అడ్డంకులు పెట్టొచ్చు. కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు’’ అని అంటున్నారు కథానాయకుడు నితిన్‌. తాజాగా ఆయన తన సతీమణ...

Updated : 07 Jan 2022 11:24 IST

హైదరాబాద్‌: ‘‘కొవిడ్‌.. మనుషుల మధ్య దూరాన్ని పెంచొచ్చు. కానీ ప్రేమకు ఎలాంటి అడ్డంకులు పెట్టలేదు’’ అని అంటున్నారు కథానాయకుడు నితిన్‌. తాజాగా ఆయన తన సతీమణి షాలిని పుట్టిన రోజును విభిన్నంగా జరిపారు. కరోనా కారణంగా షాలిని ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారు. దీంతో శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా గురువారం అర్ధరాత్రి ఆమెను కిటికీ నుంచి బయటకు చూడమని చెప్పి.. గార్డెన్‌ ఏరియాలో కేక్‌ కట్‌ చేసి నితిన్‌ శుభాకాంక్షలు తెలిపారు. నితిన్‌ చూపించిన ప్రేమకు ఫిదా అయిన ఆమె థ్యాంక్యూ అంటూ చిరునవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియోని నితిన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘‘హ్యాపీ బర్త్‌డే మై లవ్‌. జీవితంలో మొదటిసారి నువ్వు నెగెటివ్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని ట్వీట్‌ చేశారు. అది చూసిన ఫ్యాన్స్‌.. ‘‘హ్యాపీ బర్త్‌డే.. మీరు త్వరగా కోలుకోవాలి’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న నితిన్‌-షాలిని.. ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జులై 27న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని