Nivetha Thomas: కిలిమంజారోపై నివేదా

విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో మెప్పించే నివేదా థామస్‌... నిజ జీవితంలో సాహసాలు చేస్తూ ఉంటుంది. అలా ఇటీవలే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో

Updated : 24 Oct 2021 09:49 IST

విభిన్నమైన పాత్రలు, సహజమైన నటనతో మెప్పించే నివేదా థామస్‌... నిజ జీవితంలో సాహసాలు చేస్తూ ఉంటుంది. అలా ఇటీవలే ఆమె ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారోను అధిరోహించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆమె సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆఫ్రికాలోని కిలిమంజారో నేషనల్‌ పార్క్‌లో ఈ పర్వతం ఉంది. దీన్ని అధిరోహించిన నివేద... ‘‘నేను సాధించాను. కిలిమంజారో పర్వతంపైన ఉన్నందుకు ఆనందంగా ఉంది.’’ అంటూ రాసుకొచ్చారు. ఇటీవలే ‘వకీల్‌సాబ్‌’లో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన నివేదా ప్రస్తుతం ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని