Nivetha Thomas: కిలిమంజారో ఎక్కిన నటి నివేదా థామస్‌

ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నటి నివేదా థామస్‌ విజయవంతంగా అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘‘నేను సాధించాను...

Published : 23 Oct 2021 16:07 IST

హైదరాబాద్‌: ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నటి నివేదా థామస్‌ విజయవంతంగా అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘ ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’’ అంటూ ఆమె ఓ ఫొటో షేర్‌ చేశారు. చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్‌ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. 19,340 అడుగుల ఎత్తు ఉన్న కిలిమంజారో పర్వతంపై ట్రెక్కింగ్‌ ఎంతో సాహసోపేతంతో కూడుకున్నది. ఇక, సినిమాల విషయానికి వస్తే ఇటీవల ‘వకీల్‌సాబ్‌’తో నివేదా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో నివేదా పల్లవి అనే అమ్మాయి పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆమె ‘మీట్‌ క్యూట్‌’లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని