
Vijay Devarakonda: ఎవరూ ఎవరికీ సాయం చేయరు: విజయ్ దేవరకొండ
హైదరాబాద్: టాలెంట్ ఉంటేనే సినీ పరిశ్రమలో రాణించగలమని నటుడు, టీటౌన్ క్రేజీ రౌడీ విజయ్ దేవరకొండ అన్నారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అతి తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిన ఆయన ప్రస్తుతం ‘లైగర్’ సినిమా షూట్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూట్ గత కొన్ని రోజులుగా గోవా, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. ‘లైగర్’ హీరోయిన్ అనన్యపాండేపై ప్రశంసల వర్షం కురిపించారు.
‘‘కెరీర్‌లో విజయం సాధించి ఓ పేరు సంపాదించుకునేందుకు ప్రతి ఒక్కరు తమ తమ పనుల్లో ఎంతో కష్టపడుతుంటారు. సినీ పరిశ్రమలో ఎప్పుడూ పోటీ వాతావరణమే ఉంటుంది. కేవలం విజయాలు మాత్రమే పరిశ్రమలో మీరు రాణించడానికి దోహదపడతాయి. అందుకోసం మీరు తప్పకుండా అద్భుతంగా నటించాల్సి ఉంటుంది. అలా కాకపోతే ఏదో ఒక సమయంలో మీకు సాయం చేయడానికి కూడా ఎవ్వరూ ఉండరు. కాబట్టి, పరిశ్రమలో రాణించడం కోసం మేము ఎంతో కష్టపడ్డాం. ‘లైగర్’ కోసం అనన్య ఎంతో శ్రమించారు. ఆమె అద్భుతంగా నటించారు. సినిమా విడుదలయ్యాక ఆమెను అందరూ ఇష్టపడతారు’’ అని విజయ్ తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం విజయ్ కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు. ఇందులో ఆయన పొడవాటి జుత్తుతో విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. హాలీవుడ్ నటుడు మైక్ టైసన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.