RRR: ఆర్‌ఆర్‌ఆర్ సెట్‌లో వాలీబాల్ ఆడిన తారక్-జక్కన్న.. వీడియో వైరల్
సినిమా తెరకెక్కించడమనేది సాధారణమైన విషయం కాదు. అందులోనూ భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమా అయితే.. దర్శకుడు, నటీనటులపై ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పలేం. అదేవిధంగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్....
హైదరాబాద్: సినిమా తెరకెక్కించడమనేది సాధారణ విషయం కాదు. అందులోనూ భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమా అయితే.. దర్శకుడు, నటీనటులపై ఉండే ఒత్తిడి మాటల్లో చెప్పలేం. అదేవిధంగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్. తారక్-రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ చివరిదశలో ఉంది. కాగా, నిర్విరామంగా జరుగుతున్న ఈ సినిమా షూట్ నుంచి తారక్-రాజమౌళి చిన్న బ్రేక్ తీసుకుని.. ఇతర బృందంతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడారు. తారక్-జక్కన్న వేర్వేరు టీమ్‌లుగా విడిపోయి ఈ ఆటలో పాల్గొన్నారు. తారక్ టీమ్‌లో కీరవాణి కుమారుడు కాలభైరవతో పాటు, కార్తికేయ కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియో బయటకు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా తారక్ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో కనిపించనున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ తారలు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. చెర్రీ సరసన ఆలియాభట్, ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు, ఇటీవల విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29/01/2023)
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Movies News
Pathaan: రోజుకు రూ. వంద కోట్లు.. ‘పఠాన్’ ఖాతాలో మరో రికార్డు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!
-
Sports News
Gill - Pant: భవిష్యత్తులో కెప్టెన్సీకి వారిద్దరూ అర్హులు: ఆకాశ్ చోప్రా
-
Movies News
Social Look: అనుపమ స్పెషల్ పోస్ట్.. కశ్మీర్లో సిమ్రత్‌కౌర్