NTR: అభిమాని కోరిక తీర్చిన తారక్‌

మనం ఎంతగానో అభిమానించే హీరోలు.. కేవలం ఆన్‌స్క్రీన్‌ పైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ తమ ప్రవర్తనతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు...

Updated : 07 Oct 2021 16:28 IST

హైదరాబాద్‌: మనం ఎంతగానో అభిమానించే హీరోలు.. కేవలం ఆన్‌స్క్రీన్‌ పైనే కాకుండా ఆఫ్‌ స్క్రీన్‌లోనూ తమ ఉదారతతో రియల్‌ హీరోలు అనిపించుకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్, అల్లు అర్జున్‌.. ఇలా చెప్పుకుంటూ వెళితే మన తెలుగు హీరోలందరూ అభిమానుల పట్ల తమకున్న ప్రేమను ఎన్నో సందర్భాల్లో బయటపెట్టారు. తాజాగా తారక్‌ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. వరుస షూటింగ్స్‌తో బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ తన అభిమాని కోరిక తీర్చారు.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలానికి చెందిన మురళీ అనే వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆయన విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండు కిడ్నీలు పాడైన అతడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే తారక్‌ అంటే విపరీతమైన అభిమానం ఉన్న మురళీ.. నటుడితో చివరిసారిగా మాట్లాడాలనుకుంటున్నట్లు వైద్యులకు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్‌.. వీడియో కాల్‌ చేసి.. మురళీ, అతని కుటుంబసభ్యులందరితో మాట్లాడాడు. ‘నీకేం కాదు.. త్వరలోనే కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఇంటికి క్షేమంగా వచ్చేస్తావు’ అని ఎన్టీఆర్‌ ధైర్యం చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు