RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో రామ్‌చరణ్‌ అసహనం..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు....

Published : 09 Aug 2021 12:27 IST

వీడియో షేర్‌ చేసిన ఎన్టీఆర్‌

హైదరాబాద్‌: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఉక్రెయిన్‌లో టీమ్‌ ఏం చేస్తుంది? అక్కడ షూట్‌ ఎలా జరుగుతుంది? ఇలాంటి విశేషాలు తెలియజేస్తూ నేటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇన్‌స్టా ఖాతాలో పోస్టులు చేయనున్నట్లు తారక్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. రామ్‌చరణ్‌ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు. ‘చరణ్‌ డ్రమ్స్‌ ప్రాక్టీస్‌ అయ్యిందా?’ అని తారక్‌ అడగ్గా.. ‘అయిపోయింది. నిజమైన డ్రమ్స్‌ ఎక్కడ కార్తికేయ. కాస్ట్యూమ్‌ లేదు. ఏం లేవు. పొద్దుపొద్దునే తీసుకువచ్చి కూర్చొపెట్టారు’ అని రాజమౌళి కుమారుడిపై చరణ్‌ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కార్తికేయ.. ‘వస్తున్నాయి. రెండు నిమిషాలు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దసరాకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రానున్నట్లు చరణ్‌ మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది రూపుదిద్దికుంటోంది. ఆలియాభట్, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌, ఎలిసన్‌ డ్యూడీ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌, మేకింగ్‌ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి. దసరా కానుకగా అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని