
Puneeth rajkumar: ఎన్టీఆర్‌ని చూడగానే కన్నీరు పెట్టుకున్న శివరాజ్‌కుమార్
హైదరాబాద్: తన ప్రాణ స్నేహితుడు, కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు తారక్ నివాళులర్పించారు. పునీత్ మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన శనివారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. కంఠీరవ మైదానంలో శ్రద్ధాంజలి ఘటించారు. పునీత్ పార్థివదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తారక్‌ని చూసిన పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే తారక్ ఆయన్ని ఆలింగనం చేసుకుని ఓదార్చారు. తారక్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్‌నీల్ పునీత్‌కు నివాళులర్పించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.