NTR: ‘అఖండ’ వీక్షించిన ఎన్టీఆర్‌.. అదిరిందంటూ ట్వీట్ 

తన బాబాయ్‌ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రాన్ని గురువారం రాత్రి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వీక్షించారు. సినిమాలో బాబాయ్‌ అదరగొట్టేశారని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ తాజాగా ఓ ట్వీట్‌ చేశారు....

Published : 03 Dec 2021 10:16 IST

హైదరాబాద్‌: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రాన్ని గురువారం రాత్రి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వీక్షించారు. సినిమాలో బాబాయ్‌ అదరగొట్టేశారని అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘ఇప్పుడే ‘అఖండ’ చిత్రాన్ని వీక్షించాను. రీసౌండింగ్‌ సక్సెస్‌ని సొంతం చేసుకున్న బాలా బాబాయ్‌తోపాటు చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఆయన నుంచి ఎలాంటి హార్డ్‌కోర్‌ మూమెంట్స్‌ అయితే కోరుకుంటామో అవన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి’’ అని తారక్‌ పేర్కొన్నారు.

మరోవైపు, ‘అఖండ’ విజయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద చాలారోజుల తర్వాత కోలహలాన్ని చూస్తుంటే తెలుగు సినీ హవా మొదలైనట్లు ఉందంటూ పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.

యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘అఖండ’ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. ఇందులో మురళీకృష్ణ, శివుడుగా బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయనకు జోడీగా నటి ప్రగ్యాజైస్వాల్‌ సందడి చేశారు. శ్రీకాంత్‌, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ద్వారకా క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని