NTR: ‘అఖండ’ వీక్షించిన ఎన్టీఆర్.. అదిరిందంటూ ట్వీట్
తన బాబాయ్ నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రాన్ని గురువారం రాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించారు. సినిమాలో బాబాయ్ అదరగొట్టేశారని ఆయన అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ తాజాగా ఓ ట్వీట్ చేశారు....
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రాన్ని గురువారం రాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీక్షించారు. సినిమాలో బాబాయ్ అదరగొట్టేశారని అన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఇప్పుడే ‘అఖండ’ చిత్రాన్ని వీక్షించాను. రీసౌండింగ్ సక్సెస్‌ని సొంతం చేసుకున్న బాలా బాబాయ్తోపాటు చిత్రబృందం మొత్తానికి నా అభినందనలు. ఆయన నుంచి ఎలాంటి హార్డ్‌కోర్ మూమెంట్స్ అయితే కోరుకుంటామో అవన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి’’ అని తారక్ పేర్కొన్నారు.
మరోవైపు, ‘అఖండ’ విజయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సందడి వాతావరణం నెలకొంది. సినిమా థియేటర్ల వద్ద చాలారోజుల తర్వాత కోలహలాన్ని చూస్తుంటే తెలుగు సినీ హవా మొదలైనట్లు ఉందంటూ పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు.
యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘అఖండ’ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రమిది. ఇందులో మురళీకృష్ణ, శివుడుగా బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించారు. ఆయనకు జోడీగా నటి ప్రగ్యాజైస్వాల్ సందడి చేశారు. శ్రీకాంత్, జగపతి బాబు కీలకపాత్రలు పోషించారు. తమన్ స్వరాలు సమకూర్చారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
రామానాయుడి ఔదార్యం!
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్‌లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్‌లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు