Cinema News: మంచి కథాంశంతో.. ‘ఓ మధు’

అబ్రార్‌ ఖాన్‌, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఓ మధు’. ఏ.యమ్‌ ఖాన్‌ నిర్మాత. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది.....

Updated : 29 Oct 2021 07:53 IST

బ్రార్‌ ఖాన్‌, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి తెరకెక్కించిన చిత్రం ‘ఓ మధు’. ఏ.యమ్‌ ఖాన్‌ నిర్మాత. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకొని దర్శక నిర్మాతలకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది. కచ్చితంగా అందరికీ నచ్చుతుంద’’న్నారు హీరో అబ్రార్‌ ఖాన్‌.  ఈ కార్యక్రమంలో నగేష్‌, సత్యారెడ్డి, యస్‌.పి.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని