Venkatesh: మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ‘నారప్ప’

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘నారప్ప’ ఒకటి. వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రమిది. ప్రియమణి నాయిక. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 16 Jul 2021 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘నారప్ప’ ఒకటి. వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన చిత్రమిది. ప్రియమణి నాయిక. జులై 20 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైలర్‌, ‘చలాకీ చిన్నమ్మి’ పాటల్ని విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా మరో సర్‌ప్రైజ్‌ని అందించింది. ‘ఓ.. నారప్ప’ అంటూ సాగే గీతాన్ని (లిరికల్‌ వీడియో) విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ పాటని ధనుంజయ్‌, వరం ఆలపించారు. మణిశర్మ సంగీతం అందించారు. వెంకటేశ్‌, అమ్ము అభిరామి మధ్య తెరకెక్కించిన గీతమిది. ఈ సినిమాలో వెంకటేశ్‌ రెండు విభిన్న పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. యువకుడి పాత్రకి జోడీగా అభిరామి నటించింది. తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందింది ఈ చిత్రం. కార్తీక్‌ రత్నం, రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషించారు. వి క్రియేషన్స్‌ పతాకంపై కలైపులి ఎస్‌. థాను సమర్పణలో సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. మాతృకకి దీటుగా ఈ సినిమాని తెరకెక్కించినట్టు ప్రచార చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని