RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో హాలీవుడ్‌ భామ.. ఆనందంగా ఉందంటూ పోస్ట్‌

సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆఖరి షెడ్యూల్‌ కోసం ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఉక్రెయిన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు...

Published : 07 Aug 2021 11:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌ రౌద్రం రణం రుధిరం’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆఖరి షెడ్యూల్‌ కోసం ఇటీవల చిత్ర బృందం ఉక్రెయిన్‌ వెళ్లిన విషయం తెలిసిందే. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించనున్నారు. కాగా, తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లోకి హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ తిరిగి అడుగుపెట్టారు. చాలారోజుల తర్వాత టీమ్‌ మొత్తాన్ని కలవడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఈ సినిమాలో ఆమె తారక్‌ ప్రేయసి పాత్రలో కనిపించనున్నారు.

భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలివీయా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, ఎలిసన్‌ డ్యూడీ, రేయ్‌ స్టీవ్‌సన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. పోరాటయోధులు అల్లూరిసీతారామరాజు, కొమురంభీమ్‌ కలిస్తే.. వాళ్లిద్దరి మధ్య దోస్తీ ఎలా కుదిరింది? వాళ్ల దోస్తీ చివరికి ఎటువైపునకు దారి తీసింది? ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌సాంగ్‌ ప్రతి ఒక్కర్నీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని