Olympics Backdrop Films: వెండితెరపై ఒలింపిక్స్ మెరుపులివే!
క్రీడల్ని ప్రత్యక్షంగా మైదానంలో చూస్తే ఎంతటి ఉత్కంఠ నెలకొంటుందో ఆ దృశ్యాల్ని వెండి తెరపై చూస్తున్నప్పుడూ అదే అనుభూతి కలుగుతుంది. అందుకే చాలా మంది దర్శకనిర్మాతలు క్రీడా నేపథ్యమున్న చిత్రాల్ని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: క్రీడల్ని ప్రత్యక్షంగా మైదానంలో చూస్తే ఎంతటి ఉత్కంఠ ఉంటుందో ఆ దృశ్యాల్ని వెండితెరపై చూస్తున్నప్పుడూ అదే అనుభూతి కలుగుతుంది. అందుకే చాలా మంది దర్శక-నిర్మాతలు క్రీడా నేపథ్యమున్న చిత్రాల్ని తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ క్రమంలో వచ్చిన హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలెన్నో బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. కానీ, ఒలింపిక్స్ నేపథ్యంలో సాగే కథలు మాత్రం చాలా అరుదుగా వచ్చాయి. జపాన్‌లోని టోక్యో వేదికగా ఒలింపిక్స్ క్రీడలు జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఒలింపిక్స్ కథాంశంగా తెరకెక్కిన కొన్ని సినిమాల వివరాల్ని చూద్దాం..
బాగ్ మిల్కా బాగ్..
భారత దిగ్గజ క్రీడాకారుడు దివంగత మిల్కాసింగ్ జీవితాధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘బాగ్ మిల్కా బాగ్’. పరుగులో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్న మిల్కాసింగ్ రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొని 0.1 సెకన్ల తేడాతో కాంస్యం అందుకోలేకపోయారు. కామన్‌వెల్త్‌లో పతకం అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ‘ఫ్లయింగ్ సిఖ్‌గా’ పేరొందారు. అలాంటి ఈ మహోన్నత అథ్లెట్ జీవితాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా. మిల్కాసింగ్ పాత్రని ఫర్హాన్ అక్తర్ పోషించారు. భావోద్వేగంతో కూడిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. తన బయోపిక్‌ని చూసి ఎంతో ఆనందించారు మిల్కాసింగ్.
చారియట్స్ ఆఫ్ ఫైర్..
ప్రపంచ వ్యాప్తంగా ఒలింపిక్స్ నేపథ్యంలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాల్లో ‘చారియట్స్ ఆఫ్ ఫైర్’ ఉత్తమంగా నిలిచింది. 1924 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇద్దరు బ్రిటీష్ క్రీడాకారుల జీవితాధారంగా తెరకెక్కిన చిత్రమిది. బెన్ క్రాస్, ఛార్లెసన్, నిగెల్ హావెర్స్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒలింపిక్స్ తీరు తెన్నుల గురించి ఎన్నో విశేషాలు ఈ సినిమాలో చూపించారు. 1980ల నాటి చిత్రమైనా ఇప్పటికీ అలరిస్తూనే ఉంది.
ఐ, టోన్యా..
ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫిగర్ స్కేటర్ టోన్యా మ్యాక్సిన్ జీవిత కథే ‘ఐ, టోన్యా’. మార్గెట్ రాబీ ప్రధాన పాత్రలో హాలీవుడ్ దర్శకుడు క్రెయిగ్ గిల్లెస్పీ తెరకెక్కించారు. హాస్య ప్రధానంగా సాగుతూనే కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకుల మనసుల్ని బరువెక్కిస్తుంది ఈ సినిమా. టోన్యా వ్యక్తిగత విషయాలతోపాటు మరో ఫిగర్ స్కేటర్ నాన్సీ కెర్రిగన్‌తో జరిగిన వివాదాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించారు. టోన్యా ఫిగర్ స్కేటర్ అవ్వాలనే కోరిక ఎలా కలిగింది? అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు ఎదుర్కొన సవాళ్లని తెరపై చూపిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
ఫాక్స్‌క్యాచర్..
1984 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ అందుకున్న ఇద్దరు సోదరుల (మార్క్, డేవిడ్) జీవితాధారంగా రూపొందిన అమెరికన్ చిత్రం ‘ఫాక్స్‌క్యాచర్’. టాటమ్, రుఫాలో కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి బెన్నెట్ మిల్లర్ దర్శకత్వం వహించారు. అన్నదమ్ములు ఇద్దరు ఎలా రెజ్లర్లుగా మారారు? అనారోగ్య సమస్యలున్నా ఎలా రాణించారు? తదితర ఆసక్తి సన్నివేశాలతో సినీ ప్రియుల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది ఈ చిత్రం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
No Smoking: ఆఫీసులో 4500 సార్లు స్మోకింగ్ బ్రేక్.. అధికారికి రూ.8.8లక్షల జరిమానా
-
India News
Karnataka: కోలార్ నుంచీ పోటీ చేస్తా: సిద్ధరామయ్య ప్రకటన
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
Sports News
David Warner: ‘డేవిడ్ వార్నర్‌ను వదిలేసి సన్‌రైజర్స్ పెద్ద తప్పు చేసింది’
-
Politics News
Karnataka polls: హంగ్‌కు ఛాన్స్‌లేదు.. ఎవరితోనూ పొత్తులుండవ్..: డీకేఎస్
-
Movies News
Social Look: భర్తతో కాజల్ స్టిల్.. నేహాశర్మ రీడింగ్.. నుపుర్ ‘వర్క్ అండ్ ప్లే’!