Samantha: కిక్కిచ్చిన ‘ఊ అంటావా’.. సమంత ఎంత కష్టపడిందో చూశారా..!

‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేకింగ్‌ వీడియో. సమంత ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూసేయండి..

Published : 07 Jan 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గమ్మత్తైన స్వరంతో ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ గాయని ఇంద్రవతి చౌహాన్‌ శ్రోతల్ని మత్తెక్కించింది. ఇదే పాటలో నర్తించి ప్రముఖ నటి సమంత ప్రేక్షకులకు మాంచి కిక్కిచ్చింది. తొలిసారి ప్రత్యేక గీతంలో కనిపించి ఉర్రూతలూగించింది. అదిరిపోయే స్టెప్పులు, రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీని వెనక ఎంత కష్టం దాగుందో తాజాగా తెలియజేసింది. ఈ మేరకు ఓ వీడియోను పంచుకుంది. ఇందులో.. డ్యాన్స్‌ మాస్టర్‌ చెప్పినట్టు ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించింది సమంత. అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ వదిలిపెట్టరంటూ శిక్షకులను ఉద్దేశించి నవ్వుతూ చెప్పుకొచ్చింది.

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రంలోని గీతమిది. ఈ పాటలో కనిపించిన అల్లు అర్జున్‌- సమంత జోడీకి మంచి మార్కులే పడ్డాయి. చంద్రబోస్‌ సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం విశేషంగా అలరించాయి. ఈ పాటకు సంబంధించిన ఎన్నో పేరడీలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. 2021 డిసెంబరులో విడుదలైన ఈ పాన్‌ ఇండియా చిత్రం అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో జనవరి 7 రాత్రి 8 గం.ల నుంచి స్ట్రీమింగ్‌కానుంది.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు