Pushpa: ‘పుష్ప’లో సమంత ఐటమ్‌ సాంగ్‌.. ఊ అంటావా మావ.. ఊఊ అంటావా!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక.

Updated : 12 Dec 2021 07:53 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ‘పుష్ప ది రైజ్‌’ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సమంత ఐటమ్‌ సాంగ్‌తో అలరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ‘ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ’ అంటూ సాగే పాటకు సంబంధించిన లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. మాస్‌ను మరోసారి ఆకట్టుకునేలా దేవిశ్రీ ప్రసాద్‌ ఈ సాంగ్‌ను తీర్చిదిద్దారు. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈనెల 12న ‘పుష్ప ప్రీరిలీజ్‌ పార్టీ’ని హైదరాబాద్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని