
Pakka Commercial: చేసి.. చూసి.. వచ్చేశా
‘‘నా హీరోయిజంకి ఒక ఆరా ఉంటుంది. కాన్సంట్రేట్ చేస్తే.. ఆ ఆరా నుంచి ఓ ఆర్ఆర్ వినిపిస్తుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి కిక్కాస్ ఉంటుంది’’ అంటున్నారు గోపీచంద్. ఆయన హీరోగా దర్శకుడు మారుతి రూపొందిస్తున్న చిత్రం ‘పక్కాకమర్షియల్’. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ప్రచార చిత్రం చూస్తుంటే.. టైటిల్‌కు తగ్గట్టే మారుతి ఈ సినిమాని పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. టీజర్లో గోపీచంద్‌లోని యాక్షన్ కోణాన్ని.. కామెడీ యాంగిల్‌ని స్టైలిష్‌గా చూపించారు. ‘‘ఎవరికి చూపిస్తున్నారు సర్ మీ విలనిజం. మీరిప్పుడు చేస్తున్నారు. నేనెప్పుడో చేసి.. చూసి.. వచ్చేశా’’ అంటూ టీజర్లో గోపీచంద్ చెప్పిన డైలాగ్ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఈ చిత్రంలో గోపీచంద్, రాశీ న్యాయవాదులుగా నటిస్తున్నారు. సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ స్వరాలందిస్తుండగా.. కరమ్ చావ్లా ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.