
Pawan Kalyan: మహేశ్‌కు పవన్ గిఫ్ట్.. ఏం పంపారో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక సందర్భాల్లో పలువురు సినీ తారలకు బహుమతులు ఇస్తుంటారు. ఈ క్రమంలోనే దీపావళి పండగని పురస్కరించుకుని మహేశ్‌బాబు కుటుంబానికి పవన్ దంపతులు స్వీట్లు, పర్యావరణహిత టపాసులను పంపించారు. వీటిని స్వీకరించిన మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా పవన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై అటు పవన్ అభిమానులు, ఇటు మహేశ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు అగ్ర హీరోల మధ్య స్నేహబంధాన్ని చూసి ఫిదా అవుతున్నారు. అయితే, పవన్, మహేశ్ మధ్య స్నేహం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో వారిద్దరూ మంచి స్నేహితులు. ఈ అనుబంధంతోనే.. పవన్ కల్యాణ్ నటించిన ‘జల్సా’ సినిమాకి మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక దర్శకుడు క్రిష్‌కు కూడా పవన్ బహుమతులు పంపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.