Pawankalyan: చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం 

అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టమని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిరంజీవి 66వ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రత్యేకంగా విషెస్‌ తెలిపారు....

Published : 22 Aug 2021 12:29 IST

పత్రికా ప్రకటన విడుదల చేసిన పవర్‌స్టార్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తాను చేసుకున్న అదృష్టమని నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. చిరంజీవి 66వ పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఉదయం ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. తనకు మాత్రమే కాకుండా పరిశ్రమలో ఉన్న ఎంతోమందికి చిరు మార్గదర్శకులని.. స్ఫూర్తి ప్రదాతని పవన్‌ అన్నారు. చిరుని అభిమానించే లక్షలాదిమంది అభిమానుల్లో తాను కూడా ఒకడినన్నారు. సామాన్యుడిగా ప్రయాణాన్ని ఆరంభించిన చిరు ఎన్నో కష్టాలు ఎదుర్కొని అసామాన్యుడిగా ఎదిగారని.. ఎంత ఎదిగినప్పటికీ ఒదిగి ఉండడం ఆయనలో ఉండే గొప్ప లక్షణమని కొనియాడారు. అన్నగా పుట్టినప్పటికీ చిరు తమని తండ్రిలా సాకారని.. తండ్రి స్థానంలో నిలిచి.. ప్రేమను అందించారని పవన్‌ వివరించారు. చిరంజీవి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని కోరుకున్నారు. అంతేకాకుండా పేద కళాకారులు, సాయం కోరిన ప్రతి ఒక్కరికీ చిరు చేస్తోన్న సేవలను పవన్‌ ఈ సందర్భంగా ప్రశంసించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు