Rajinikanth: రజనీకాంత్‌ అభిమానులకి వెంకటేశ్‌ సర్‌ప్రైజ్‌.. ‘పెద్దన్న’ టీజర్‌ అదిరింది!

రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది.

Published : 23 Oct 2021 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్: రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. నయనతార కథానాయిక. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా టాలీవుడ్‌ నటుడు వెంకటేశ్‌ టీజర్‌ని విడుదల చేశారు. రజనీకాంత్‌ అభిమానులు కోరుకునే అన్ని అంశాలను మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్‌ చూస్తే అర్థమవుతుంది. రజనీకాంత్‌ లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు’ అనే డైలాగ్‌ అలరిస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌, మీనా, ఖుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: డి. ఇమ్మాన్‌, ఛాయాగ్రహణం: వెట్రి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని