PelliSandaD: తెలుగులోగిళ్లలో మరోసారి పెళ్లి సందD షురూ..!
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’. చిన్న బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి తెలుగువారికి అమితంగా....
ట్రైలర్ లాంఛ్ చేసిన సూపర్‌స్టార్ మహేశ్‌బాబు
హైదరాబాద్: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నటుడు శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’. చిన్న బడ్జెట్ చిత్రంగా తెరకెక్కి తెలుగువారికి అమితంగా చేరువైన ఈ సినిమాకి ఇప్పుడు కొనసాగింపుగా ‘పెళ్లి సందD’ రూపొందుతోంది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. దసరా కానుకగా వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ‘పెళ్లి సందD’ ట్రైలర్‌ను విడుదల చేశారు. రోషన్ - శ్రీలీల నటన.. మ్యూజిక్‌తో కీరవాణి చేసిన మ్యాజిక్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ చూసిన నెటిజన్లు.. ‘తెలుగు లోగిళ్లలో మరోసారి పెళ్లి సందడి షురూ కానుంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై మెరవనున్నారు. ప్రకాశ్ రాజ్, రాజేంద్రప్రసాద్, హేమ, ఝాన్సీ, రావు రమేశ్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర తారాగణం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Girish Bapat: భాజపా ఎంపీ గిరీశ్ బాపట్ కన్నుమూత.. ప్రధాని మోదీ విచారం
-
General News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ ఇంకెవరికైనా ఇచ్చారా?.. ముగ్గురు నిందితులను విచారిస్తున్న సిట్
-
Movies News
Chamkeela Angeelesi: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘చమ్కీల అంగిలేసి’.. ఈ వీడియోలు చూశారా..!
-
World News
Biden Vs Netanyahu: మా నిర్ణయాలు మేం తీసుకుంటాం.. అమెరికాకు స్పష్టం చేసిన ఇజ్రాయెల్
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు విచారణకు కొత్త సిట్..
-
Sports News
Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?