Perni Nani: ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో పేర్ని నాని భేటీ

ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో పేర్ని నాని భేటీ..

Updated : 26 Nov 2021 15:44 IST

అమరావతి: సినిమాకు సంబంధించి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానాన్ని ఏపీ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్‌లైన్‌ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. వెబ్‌సైట్‌, యాప్‌ రూపకల్పనపై  చర్చించారు. ఈ సమావేశంలో బుక్‌ మై షో, పేటీఎం, జస్ట్‌ బుకింగ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లలో అమలు చేసేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిదని గతంలో మంత్రి నాని అన్నారు. ఇప్పటికే దీనిపై పలుమార్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు కూడా జరిపారు. చాలామంది ఆన్‌లైన్‌ వ్యవస్థపై మొగ్గుచూపడంతో ప్రభుత్వం కార్యచరణను వేగవంతం చేస్తోంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని