Perni Nani: ఆన్‌లైన్‌లో మూవీ టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారు!

ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు

Published : 15 Sep 2021 02:01 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను విక్రయించనున్నట్లు వస్తున్న వార్తలపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విపక్ష నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు.

ఈ అంశంపై కమిటీలు వేశామని.. అధ్యయనం జరుగుతోందని మంత్రి చెప్పారు. త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని ఏది చేపట్టినా విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారని.. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి స్పష్టం చేశారు. పన్ను ఎగవేత జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గమనించిందన్నారు. బ్లాక్‌ టిక్కెట్లు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలోనే  భేటీ అవనున్నట్లు నాని వెల్లడించారు. ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నేతృత్వంలో సమావేశం నిర్వహించనున్నట్ల చెప్పారు. ఆగస్టులో భేటీ కావాలని భావించినా కుదరలేదని.. సినీ పరిశ్రమ పెద్దలతో సీఎం జగన్‌ త్వరలోనే సమావేశమవుతారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని