Aadi: ఆదితో కొత్తగా మరొకటి
ఆది సాయికుమార్ కథానాయకుడిగా కల్యాణ్ జి గోగణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పూత్ కథానాయిక. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆది సాయికుమార్ కథానాయకుడిగా కల్యాణ్ జి గోగణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్‌పూత్ కథానాయిక. సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. శనివారం నాగం తిరుపతిరెడ్డి పుట్టినరోజు. ఈ నేపథ్యంలోనే ఆది సాయికుమార్, జీ కల్యాణ్ కలయికలోనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ.. ‘‘తీస్ మార్ ఖాన్’ని చాలా సరదాగా పూర్తి చేశాం. ఇప్పుడిదే టీమ్‌తో మరోసారి కలిసి పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘తీస్ మార్ ఖాన్’లో ఆది తన నటనతో అబ్బురపరిచారు. మా కలయికలో రానున్న కొత్త సినిమాతో మరో విలక్షణ కథను మీ ముందుంచుతాం’’ అన్నారు దర్శకుడు కల్యాణ్. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఆది, కల్యాణ్‌లతో మరోసారి కలిసి పనిచేయనున్నందుకు ఆనందంగా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తా. ఇకపై ఆదితో ఏటా ఓ చిత్రం ప్లాన్ చేస్తాన’’న్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
-
General News
Bengaluru: బెంగళూరుకు గులాబీ శోభ.. నగరంలో కొత్త అందాల ఫొటోలు చూశారా?
-
World News
Viral News: ఒక్కో ఉద్యోగికి ₹6 కోట్లు బోనస్.. కట్టలుకట్టలుగా పంచిన చైనా కంపెనీ!