
Updated : 03 Oct 2021 21:38 IST
MAA Elections: ‘మా’ సభ్యులకు ప్రకాశ్‌రాజ్ లంచ్ పార్టీ
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించేందుకు నటుడు ప్రకాశ్‌రాజ్ ఎంతో ప్రయత్నిస్తున్నారు. తన టీమ్‌తో కలిసి వరుస ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన అసోసియేషన్ సభ్యులందరికీ లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం మధ్యాహ్నం అసోసియేషన్ సభ్యులందరితో సమావేశమైన ప్రకాశ్‌రాజ్.. తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి వివరించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం తాను చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వాళ్లతో చర్చలు జరిపారు. అలాగే, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చదవండి
Tags :