MAA Elections: ప్యానెల్‌ సభ్యులతో ప్రకాశ్‌ రాజ్‌ సమావేశం

తన ప్యానెల్‌ సభ్యులతో ప్రకాశ్‌రాజ్ సమావేశమయ్యారు. వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు. 

Published : 05 Sep 2021 21:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల అంశం రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని భావించిన హేమ, జీవితా రాజశేఖర్‌ అనూహ్యంగా ప్రకాశ్‌ రాజ్‌ ‘‘సిని‘మా’ బిడ్డలం’’ ప్యానెల్‌లో చేరడం హాట్‌ టాపిక్‌ అయింది. మరోవైపు.. ఈ ప్యానెల్‌కి సంబంధించి అధికార ప్రతినిధిగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఎంపికవగా ప్యానెల్‌ నుంచి తప్పుకున్నట్టు ఆయన ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన ప్యానెల్‌ సభ్యులతో సమావేశమయ్యారు. ‘‘సిని‘మా’ బిడ్డలం కలిశాం. నా టీమ్‌ని, వారి స్ఫూర్తిని ఎంతో ఇష్టపడుతున్నా. జయహో సినిమా’ అని ట్వీట్‌ చేశారు. పలు అంశాలపై కూలంకషంగా చర్చించి, త్వరలోనే ఎజెండాను ప్రకటించనున్నారు. ఈ సమావేశంలో జీవితా రాజశేఖర్‌, శ్రీకాంత్‌, హేమ, అనసూయ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని