MAA Elections: ‘మా’ ఎన్నికలపై సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి: ప్రకాశ్‌రాజ్‌ 

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రకాశ్‌రాజ్‌ పశ్చిమ మండల పోలీసు ఉన్నతాధికారులను...

Published : 18 Oct 2021 10:35 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన ప్రకాశ్‌రాజ్‌ పశ్చిమ మండల పోలీసు ఉన్నతాధికారులను ఆదివారం కోరారు. ఈ వ్యవహారంపై సోమవారం ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఎన్నడూ లేనివిధంగా ఈసారి ‘మా’ ఎన్నికలు ఎంతో హోరాహోరీగా జరిగాయి. అక్టోబర్‌ 10న జరిగిన ఎన్నికల్లో ‘మా’ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్స్‌ మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. పోలింగ్‌ సమయంలో విష్ణు ప్యానెల్‌ సభ్యులు తమపై దాడికి పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని.. వాటిపై స్పష్టత కోసమే సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వాలని కోరుతూ ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఈక్రమంలోనే ఆయన పోలీస్‌ అధికారులను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని