KGF2: రమిక.. భయపెట్టే   ప్రధాన మంత్రి

యశ్‌ కథా నాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కెజిఎఫ్‌ 2’. ఈ సినిమాలో రమిక సేన్‌ అనే శక్తిమంతమైన పాత్రలో రవీనా టాండన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రవీనా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కొత్త లుక్‌ను ప్రశాంత్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.

Updated : 27 Oct 2021 07:15 IST

యశ్‌ కథా నాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘కెజిఎఫ్‌ 2’. ఈ సినిమాలో రమిక సేన్‌ అనే శక్తిమంతమైన పాత్రలో రవీనా టాండన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రవీనా పుట్టినరోజు సందర్భంగా.. ఆమె కొత్త లుక్‌ను ప్రశాంత్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ‘‘ఇందులో రమిక పాత్రని మీరు పోషించినట్లు ఎవరూ పోషించి ఉండరు. నేను పని చేసిన అత్యంత ఆహ్లాదకరమైన, భయపెట్టే ప్రధాన మంత్రి. రవీనాకు పుట్టినరోజు శుభాకాంక్షలు’’ అంటూ ఆ ఫొటోకు ఓ వ్యాఖ్యను జత చేశారు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రంలో అధీరా అనే ప్రతినాయకుడిగా సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని