Priyanka Chopra: మ్యాట్రిక్స్‌ వెలుగుల్లో ప్రియాంక తళుకులు..

బాలీవుడ్‌ నాయిక ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్రెక్షన్స్‌’. ఇటీవల ఈ సినిమా ప్రీమియర్‌ షోను శాన్‌ ఫ్రాన్సిస్కోలోని

Updated : 20 Dec 2021 06:55 IST

బాలీవుడ్‌ నాయిక ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరస చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘ది మ్యాట్రిక్స్‌ రీసర్రెక్షన్స్‌’. ఇటీవల ఈ సినిమా ప్రీమియర్‌ షోను శాన్‌ ఫ్రాన్సిస్కోలోని కాస్ట్రో థియేటరల్లో ప్రదర్శించారు. ఈ వేడుకకు చిత్రబృందంతో పాటు పలువురు హాలీవుడ్‌ తారలు హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రియాంక ఆకట్టుకునే ఆహార్యంతో ముస్తాబై అలరించింది. ఈ కార్యక్రమంలో నీల్‌ ప్యాట్రిక్‌ హారిష్‌, జెస్సికా హెన్విక్‌, కీనూ రీవిస్‌, లానా వచౌస్కీ తదితరులు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు