MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పేంటి: బండ్ల గణేశ్‌

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తే తప్పేంటి? అంటూ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రశ్నించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మరోసారి ...

Updated : 04 Sep 2021 15:50 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తే తప్పేంటి? అంటూ నిర్మాత బండ్ల గణేశ్‌ ప్రశ్నించారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్‌రాజ్‌ని నాన్‌లోకల్‌ అనడం పట్ల గణేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రకాశ్‌రాజ్‌ తెలుగు సినిమాల్లో పనిచేస్తున్నారని.. ఆయన ఎలా నాన్‌ లోకల్‌ అవుతారని ప్రశ్నించారు. సినిమాల కోసం ముంబై, కేరళ, కర్ణాటక నుంచి హీరోయిన్స్‌ని టాలీవుడ్‌లోకి తీసుకువస్తే తప్పులేదు కానీ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పా అని అన్నారు. అంతేకాకుండా ప్రకాశ్‌రాజ్‌ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. కరోనా సమయంలో వందల కుటుంబాలను ఆయన ఆదుకున్నారని తెలిపారు. ఒకవేళ ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడైతే టాలీవుడ్‌కే గర్వకారణమని వ్యాఖ్యానిచ్చారు.

మరోకొన్ని రోజుల్లో నిర్వహించనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు ఈ ఏడాది పోటీ హోరాహోరీగా ఉండనుంది. నిన్నటివరకూ విడివిడిగా పోటీ చేస్తున్నారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ.. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి అడుగుపెట్టారు. దీంతో, ఈసారి ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌, మంచువిష్ణు ప్రధాన పోటీదారులుగా మారారు. మరోవైపు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే ‘‘సినీ‘మా’ బిడ్డలు’’ పేరుతో తన ప్యానెల్‌ని ప్రకటించారు. మంచు విష్ణు సైతం పోటీలో గెలుపొందేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని