Natti Kumar: నట్టి కుమార్‌ పిటిషన్‌.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నట్టి కుమార్‌ వేసిన పిటిషన్‌కి పరిశీలించి, తక్షణమే జీవో 35ని అమలు అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకి ఏపీ హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 04 Oct 2021 21:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తక్షణమే జీవో 35 అమలయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, ఎగ్జిబిటర్‌ నట్టి కుమార్‌ తెలిపారు. థియేటర్లకి సంబంధించి టికెట్‌ ధరల్ని నిర్ణయిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవో 35ని తీసుకొచ్చింది. ఈ జీవోని కొందరు థియేటర్ల యజమానులు ఉల్లంఘించారంటూ నట్టి కుమార్‌ పిటిషన్‌ వేసిన పిటిషన్‌పై జరిగిన వాదనల అనంతరం హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

‘విశాఖపట్నం జిల్లాలోని కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు 35 జీవోను అమలు చేయడంలో విఫలమయ్యాయి. తమ ఇస్టానుసారం అధిక రేట్లకు, బహిరంగంగా బ్లాక్‌ టిక్కెట్లని అమ్ముతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. తక్షణమే ఈ దోపిడీపై చర్యలు తీసుకోవాలి’’ అని నట్టి కుమార్ హైకోర్టుకు గతంలో విన్నవించారు. ఈ విషయమై వాదనలు ముగిశాక జీవో 35ని అమలు చేయాలంటూ హోమ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌, అనకాపల్లి ఆర్డీవోకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయం గెలిచిందని ఈ సందర్భంగా నట్టి కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని