AP News: నవరత్నాలతో పాటు సినిమా రంగాన్ని కాపాడాలి: నిర్మాత ఎన్వీ ప్రసాద్‌

రాష్ట్రంలో సీజ్‌ చేసిన థియేటర్లకు ప్రభుత్వం నెల సమయం ఇవ్వడం సంతోషకరమని, అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ

Updated : 30 Dec 2021 17:46 IST

తిరుపతి : రాష్ట్రంలో సీజ్‌ చేసిన థియేటర్లకు ప్రభుత్వం నెల సమయం ఇవ్వడం సంతోషకరమని, అందరి తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘‘ఎగ్జిబిటర్లుగా మా తప్పులూ కొన్ని ఉన్నాయి. సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తున్నాం. అన్ని పత్రాలు సమర్పించినా అధికారులు అనుమతి ఇవ్వని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మాకు మరింత సహకరించాలి. తెలుగు సినిమాకు ఇప్పుడు దేశ వ్యాప్త ఖ్యాతి ఉంది. కరోనా నుంచి డిసెంబరులోనే కాస్త కుదుటపడుతున్నాం. మల్టీప్లెక్స్‌లలోనే తిను బండారాల ధరలు అధికంగా ఉన్నాయి. టికెట్‌ ధరల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. నవరత్నాలతో పాటు ఈ వ్యవస్థను కూడా సీఎం కాపాడాలి. విధానపరమైన నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం వల్లే  ఈసమస్య ఇంత వరకు వచ్చింది’’ అని ఎన్వీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని