
Srujan: ఏడాదికి ఐదు చిత్రాలు నిర్మిస్తా
‘‘నా బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. అందులో మంచి కథ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలి. అలా నాకంటూ ఓ మార్క్ సృష్టించుకోవడమే నా లక్ష్యం’’ అంటున్నారు నిర్మాత సృజన్ యరబోలు. ‘గతం’, ‘తిమ్మరుసు’ లాంటి విజయాల తర్వాత ఆయన నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘అద్భుతం’. ఈ సినిమా ఇటీవలే ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు సృజన్.
* ‘‘మేము ‘అద్భుతం’ చిత్రాన్ని థియేటర్లు లక్ష్యంగానే తెరకెక్కించాం. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాని ఓటీటీలో విడుదల చేశాం. ఈచిత్రానికి ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది’’.
* ‘‘ప్రస్తుతం నా బ్యానర్లో 8 చిత్రాలు నిర్మితమవుతున్నాయి. నేనెప్పుడూ కథనే నమ్ముతాను. ప్రతి ఏడాది నా బ్యానర్ నుంచి 5చిత్రాలైనా తీసుకురావాలని అనుకుంటున్నాను’’.