Published : 07/10/2021 12:43 IST

MAA Elections: నటీనటులందరికీ నిర్మాతల మండలి కీలక ప్రకటన

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ‘మా’ ఎన్నికలు సాగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారా? అని అటు పరిశ్రమలోని సభ్యులతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఎన్నికల్లో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటీనటులందరికీ నిర్మాతల మండలి ఓ కీలక విజ్ఞప్తి చేసింది. 10 తేదీన జరగనున్న ‘మా’ ఎన్నికల్లో ఓటేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని సూచించింది. ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకే ఈ సూచన చేసినట్లు ప్రకటించింది.

అక్టోబర్‌ 10, ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు.. ఈసారి అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ‘మా’కు శాశ్వత భవన నిర్మాణం, అసోసియేషన్‌ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే ప్రధాన అజెండాగా వీరిద్దరూ బరిలో పోటీపడుతున్నారు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని