Project K: ‘ప్రాజెక్ట్‌ కె’ కోసం రంగంలోకి!

ఒక పక్క పాత సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోపక్క కొత్త చిత్రాల కోసం రంగంలోకి దిగుతున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. ‘ఆదిపురుష్‌’ని పూర్తి చేసిన ఆయన ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి అడుగుపెట్టారు. మరోపక్క ‘రాధేశ్యామ్‌’

Updated : 12 Dec 2021 08:06 IST

ఒక పక్క పాత సినిమాల్ని పూర్తి చేస్తూ... మరోపక్క కొత్త చిత్రాల కోసం రంగంలోకి దిగుతున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. ‘ఆదిపురుష్‌’ని పూర్తి చేసిన ఆయన ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ కోసం సెట్స్‌పైకి అడుగుపెట్టారు. మరోపక్క ‘రాధేశ్యామ్‌’ విడుదలకి ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌ కథా నాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణ షురూ అయ్యింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో శనివారం నుంచి ప్రభాస్‌, దీపికా పదుకొణెలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. కథ రీత్యా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ చేస్తున్నారు. ఇందులో ప్రముఖ నటులు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయపై ఇదివరకే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ‘మహానటి’ తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని