Updated : 21 Dec 2021 13:28 IST

Jabardasth: ‘జబర్దస్త్‌’ యాంకర్‌ మారింది.. అందరి పెర్ఫామెన్స్‌ అదిరింది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తే కార్యక్రమం ‘జబర్దస్త్‌’. ఎప్పటిలానే ఈవారం గిలిగింతలు పెట్టేందుకు సిద్ధమైంది. తాజా ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో నెట్టింట విడుదలై సందడి చేస్తోంది. ఆ విశేషాలివీ.. అనివార్య కారణాలతో ఈ షో వ్యాఖ్యాత అనసూయ హాజరుకాలేకపోవడంతో ఆమె స్థానంలో రష్మి ఎంట్రీ ఇచ్చింది. ‘వర్షం’ సినిమాలోని ‘నచ్చావే నైజాం పోరి’ పాటకు డ్యాన్స్‌ చేసి అలరించింది. ఆది- శాంతి స్వరూప్‌ టీమ్‌లో బుల్లితెర నటుడు రవికృష్ణ అతిథిగా కనిపించారు. తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇమ్మాన్యుయేల్‌ సంభాషణలకు న్యాయ నిర్ణేత రోజా పంచ్‌లు విసిరి కడుపుబ్బా నవ్వించారు. రాఘవ ప్రదర్శించిన భార్యభర్తల స్కిట్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. చలాకీ చంటి, అదిరే అభి హంగామా ప్రత్యేకంగా నిలిచింది. అన్ని స్కిట్‌లు తమని మెప్పించడంతో రోజా, మనో అందరినీ ‘పెర్ఫామర్‌ ఆఫ్ ది డే’గా ప్రకటించారు.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని