Puneet Rajkumar: పునీత్‌ సింప్లిసిటీకి నిదర్శనం ఈ వీడియో!

తనెంత పెద్ద స్టార్‌ అయినా పునీత్‌ రాజ్‌కుమార్‌ తన చుట్టూ ఉండే వారితో ఇట్టే కలిసిపోయేవారు . అందరినీ నవ్వుతూ పలకరిస్తుండేవారు.

Published : 29 Oct 2021 22:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనెంత పెద్ద స్టార్‌ అయినా పునీత్‌ రాజ్‌కుమార్‌ తన చుట్టూ ఉండే వారితో ఇట్టే కలిసిపోయేవారు. అందరినీ నవ్వుతూ పలకరించేవారు. ఆయన వ్యక్తిత్వానికి సాధారణ ప్రజలే కాదు సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యేవారు. అలాంటి వ్యక్తి మరణాన్ని అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులూ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్‌కుమార్‌తో ఉన్న తమ అనుబంధాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుచేసుకుని, సంతాపం ప్రకటిస్తున్నారు. పునీత్‌ సింప్లిసిటీకి నిదర్శంగా నిలుస్తోంది ఓ వీడియో. తన ఆఖరి చిత్రం ‘యువరత్న’ ప్రచారంలో భాగంగా అభిమానుల్ని రాజ్‌కుమార్‌ సర్‌ప్రైజ్‌ చేసిన వీడియో ఇది. ఎంతో ఆప్యాయంగా తన అభిమానులతో రాజ్‌కుమార్‌ మాట్లాడిన తీరు హృదయాల్ని హత్తుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని