Puneeth Rajkumar: పునీత్‌కు వైద్యమందించిన డాక్టర్‌కు పోలీస్‌ బందోబస్తు

కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బెంగళూరులోని సదాశివనగర పోలీసుస్టేషన్‌కు రెండు ఫిర్యాదులు అందాయి. ఆయన కుటుంబ వైద్యుడు రమణరావును తక్షణ...

Published : 07 Nov 2021 12:56 IST

బెంగళూరు, న్యూస్‌టుడే: కన్నడ సినీ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బెంగళూరులోని సదాశివనగర పోలీసుస్టేషన్‌కు రెండు ఫిర్యాదులు అందాయి. ఆయన కుటుంబ వైద్యుడు రమణరావును తక్షణం అరెస్టు చేయాలని ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సదాశివనగరలో నివసించే డాక్టర్‌ రమణరావు నివాసం, క్లినిక్‌ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్‌కు ఎలాంటి అనారోగ్య సమస్య లేదని, తమ క్లినిక్‌కు వచ్చినప్పుడు ప్రాథమిక చికిత్స చేశామని డాక్టర్‌ రమణరావు స్పష్టం చేశారు. ఫిట్‌నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే పునీత్‌ గత నెల 29న జిమ్‌ చేస్తూ.. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన తన సతీమణితో కలిసి వ్యక్తిగత వైద్యుడు రమణరావుని సంప్రదించగా.. ప్రాథమిక చికిత్స అనంతరం విక్రమ్‌ ఆస్పత్రికి వెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ క్రమంలోనే పునీత్‌ ప్రాణాలు కాపాడేందుకు విక్రమ్‌ వైద్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని