Pushpa: అసలే కాదు వడ్డీతో సహా ఇచ్చేసిన పుష్పరాజ్‌.. ఇదెందుకు డిలీట్‌ చేశారో..!

ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల...

Updated : 31 Dec 2021 12:48 IST

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నిడివి ఎక్కువ కావడంతో ‘పుష్ప’ నుంచి తొలగించిన కొన్ని సన్నివేశాలను ఇకపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేయనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ‘పుష్ప’ డిలీట్‌ సీన్‌-1ని షేర్‌ చేసింది.

కుటుంబపోషణ నిమిత్తం అప్పు తీసుకున్న తన తల్లిపై రెడ్డప్ప అనే వ్యక్తి వీధిలో అందరి ముందు.. ‘‘భారతమ్మ ఎంతకాలం తప్పించుకుంటావ్‌ ఇట్టా. పోయిన గంగజాతరకు ఇస్తి. ఇప్పటిదాకా అసలు లేదు. వడ్డీ లేదు’’ అంటూ కేకలు వేయడంతో పుష్పరాజ్‌ అసహనానికి గురవుతాడు. దాంతో ఆ మరుసటి రోజు ఇంట్లో ఉన్న పశువులను అమ్మేసి రెడ్డప్పకు బాకీ చెల్లించేసిన పుష్పరాజ్‌..‘‘నీ లెక్క సరిపోయింది సరే.. మరి నా లెక్క. మేము అప్పు తీసుకున్నామని ఊరంతా తెలిసింది. మరి, తిరిగి ఇచ్చేశామని ఊరంతా తెలియవద్దా’’అని అతడిని కొట్టి ప్రతిఒక్క ఇంటికీ తీసుకువెళ్లి ‘‘పుష్పరాజ్‌ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు’’ అని చెప్పిస్తాడు. ఈ వీడియోలో బన్నీ నటన, బాడీ లాంగ్వేజ్‌ అదిరిపోయేలా ఉందని..ఈ సీన్‌ని ఎందుకు డిలీట్‌ చేశారో? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని