Pushpa: పుష్పరాజ్ అడ్డా.. మీరూ ఓ లుక్కేయండి..!
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు
హైదరాబాద్: ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే మూడు లిరికల్ పాటలను అభిమానులతో పంచుకొంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సరికొత్త పాటను విడుదల చేసింది. ‘‘ఏయ్.. బిడ్డా.. ఇది నా.. అడ్డా..!!’’ అంటూ సాగే ఊరమాస్ పాటను బాలీవుడ్ సింగర్ నాకాశ్ అజీజ్ ఆలపించారు. సినిమాలో అల్లు అర్జున్ పాత్రను తెలియజేసేలా తెరకెక్కిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’. ఇందులో బన్నీ.. ‘పుష్పరాజ్’ అనే ఎర్రచందనం స్మగ్లర్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా నటి రష్మిక.. శ్రీవల్లి పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: షూటింగ్లో మరో గోల్డ్.. వుషూలో రజతం
-
మా స్నేహం మీద ఒట్టు.. చంద్రబాబు ఎలాంటి తప్పూ చేయరు: బాబు బాల్య స్నేహితులు
-
Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్
-
Rohit Sharma: సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం.. వరల్డ్‌కప్ జట్టుపై నో డౌట్స్: రోహిత్
-
Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్ దంపతులు
-
YV Subbareddy: ఏ హోదాలో వైవీ సుబ్బారెడ్డికి ఆహ్వానం?