Pushpa: ‘ఇక్కడికి ఎలా వచ్చామో అలానే వెళ్లిపోదాం’..  ‘పుష్ప’ షూట్‌లో అల్లు అర్జున్‌!

అల్లు అర్జున్‌ ‘పుష్ప’ మేకింగ్‌ వీడియో. చిత్ర బృందం ఎంత కష్టపడిందో చూడండి...

Published : 06 Dec 2021 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డిసెంబరు 27న విడుదలకానున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’పై ప్రేక్షకుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తూ చిత్ర బృందం అంచనాల్ని పెంచుతోంది. ఇప్పటికే పలు పోస్టర్లు, పాటలు, టీజర్లు విడుదల చేసిన టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియోను పంచుకుంది. ఓ అడవిలో చిత్రీకరించిన దృశ్యాల్ని ఇందులో చూడొచ్చు. ఈ షూటింగ్‌ ప్రారంభమవకముందు అల్లు అర్జున్‌ చిత్ర బృందానికి ఓ విజ్ఞప్తి చేశారు. దాన్నీ ఈ వీడియోలో జతచేశారు. ‘ఎవరు వినియోగించిన ప్లాస్టిక్‌ బాటిళ్లు, కప్పుల్ని వారే దయచేసి డస్ట్‌బిన్‌లో వేయండి. మనం ఇక్కడికి ఎలా వచ్చామో అలాగే వెళ్లిపోదాం’ అని సూచించారు.

‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో రూపొందుతోంది. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ డిసెంబరు 6న విడుదలకానుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు