Pushpa: ‘పుష్ప’ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌... ఎన్ని గంటల నుంచంటే!

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA)తో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు అల్లు అర్జున్ (AlluArjun). సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా 17న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ .....

Updated : 05 Jan 2022 18:05 IST

హైదరాబాద్‌: మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’ (PUSHPA)తో మంచి విజయాన్ని అందుకున్నారు నటుడు అల్లు అర్జున్ (AlluArjun). సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 17న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రస్తుతం ప్రదర్శితమవుతోన్న ఈ చిత్రాన్ని మరికొన్నిరోజుల్లో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకులని అలరించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని