Pushpa: బన్నీ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. సక్సెస్‌మీట్‌ రద్దు..!

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఊరమాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి హిట్‌ అందుకుంది....

Published : 24 Dec 2021 12:37 IST

కారణమేమిటంటే..!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈసినిమా డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి హిట్‌ అందుకుంది. దీంతో రాష్ట్రాల వారిగా ‘పుష్ప’ సక్సెస్‌మీట్‌లకు చిత్రబృందం భారీగా ప్లాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో సక్సెస్‌మీట్‌కు టీమ్‌ సన్నాహాలు చేసింది. అయితే, అనుమతులు రాకపోవడంతో ఆ మీట్‌ని రద్దు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ ఓ ట్వీట్‌ పెట్టింది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ.. ‘పుష్పరాజ్‌’ పాత్ర పోషించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈసినిమా రూ.173 కోట్లు రాబట్టింది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని